49 రోజులు చాలు... లాక్ డౌన్ ను పూర్తిగా తొలగిస్తేనే మంచిదన్న ఆనంద్ మహీంద్రా!

  • పరిశోధనల ప్రకారం 49 రోజుల లాక్ డౌన్ చాలు
  • దశలవారీ తొలగింపు ఆలోచన శ్రేయస్కరం కాదు
  • హాట్ స్పాట్ లలో మాత్రమే ఆంక్షల అమలు  కొనసాగించవచ్చు
49 రోజుల లాక్ డౌన్ సరిపోతుందని పరిశోధనలు సూచిస్తున్నాయని, అదే నిజమైతే కనుక, ఇండియాలోనూ దాన్ని పూర్తిగా ఎత్తి వేయవచ్చని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, 49 రోజుల వ్యవధి తరువాత, లాక్ డౌన్ ఎత్తివేత అనేది సమగ్రంగా వుండాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గత ఐదు వారాలుగా ఇండియాలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్థిక వ్యవస్థలో ప్రతి విభాగమూ, మరో విభాగానికి అనుసంధానమై ఉంటుందని గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా, లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయడం అంత శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈ ఆలోచనతో పారిశ్రామిక రంగంలో రికవరీ చాలా నిదానంగా సాగుతుందని అంచనా వేసిన ఆయన, తయారీ రంగంలోని ఒక్క ఫీడర్ ఫ్యాక్టరీ తెరచుకోకున్నా, దాని ప్రభావం ప్రొడక్ట్ అసెంబ్లింగ్ యూనిట్ పై పడుతుందని హెచ్చరించారు. కేవలం హాట్ స్పాట్ లలో మాత్రమే నిబంధనల అమలు కొనసాగిస్తే సరిపోతుందని సూచించారు.

Anand Mahindra
Lockdown
Remove
Industrial Graowth

More Telugu News